మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్వకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై గాడ్ ఫాదర్ చిత్రం రూపొందుతోంది. మలయాళంలో విజయవంతమైన లూసిఫర్ కి రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ఇది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన పోస్టర్‌లో చిరంజీవి సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఆయన బ్లాక్ షేడ్స్‌తో రఫ్ అండ్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తుండగా కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ఏడాది దసరా సందర్భంగా గాడ్‌ఫాదర్‌ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : నీరవ్ షా, కళ: సురేష్ సెల్వరాజన్,














