రావణ్ నిట్టూరు, శ్రీ నికిత జంటగా ఆనంద్ జె. దర్శకత్వం వహించిన చిత్రం అలిపిరికి అల్లంత దూరంలో. ఈ చిత్రం నుంచి జనులే తరలిచేరే కిటకిటల పర్యాటకుల పట్టణం, ఎవరూ మరిచిపోని అనుభవం ఇచ్చేటి గొప్ప పట్టణం. మా తిరుపతి అంటూ సాగే పాటని విడుదల చేయగా మంచి స్పందన వస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. తిరుపతి వైభవాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాట అందరి ఫేవరేట్ రింగ్ టోన్గా మారి పోయింది. ఎక్కడ చూసిన ఇదే పాట వినిపిస్తోంది. కిట్టు విస్సా ప్రగడ రాసిన ఈ పాటని శంకర్ మహదేవన్, రమ్య బెహరా పాడారు. ప్రస్తుతం పోస్ట్ ప్రడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి అన్నారు దర్శక, నిర్మాతలు. ఈ చిత్రంలో అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి రెప్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మించారు. ఫణి కల్యాణ్ సంగీతం అందించారు.














