టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అక్టోబర్ 22న ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహం ఆవిష్కరణ, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై వివిధ దేశాల ఎన్నారైల అభిప్రాయాలు, వారి సూచనలను మంత్రి కేటీఆర్ వివరించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై వివిధ దేశాలలో ఉన్న అన్ని రాష్ట్రాల వారికి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించి మద్దతు కూడగడుతామని మహేష్ బిగాల అన్నారు. కాగా మహేష్ బిగాల చేస్తున్న వివిధ కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత. డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ పేరు పెట్టాలనే నిర్ణయం పై ఎన్నారైలు సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.














