Namaste NRI

సస్పెన్స్ కు తెర.. బయటికొచ్చిన జిన్పింగ్

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఎట్టకేలకు బయటికి వచ్చారు. వచ్చే నెల 16 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ సదస్సు జరుగనున్న నేపత్యంలో ఏర్పాటు చేసిన ఎబ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ నెల 16న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో పాల్గొని తిరిగి వచ్చాక బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఎస్సీవో సదస్సు తర్వాత బాహ్య ప్రపంచంలోకి రావడం ఇదే తొలిసారి. ఆయన పరోక్షంలో చైనాలో అధికార మార్పిడి జరుగనున్నదన్న వదంతులు వ్యాప్తించాయి.

ఐదేండ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ సదస్సులో మూడో దఫా చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్‌ను నియమించడానికి రంగం సిద్ధమైందని సమాచారం. ఈ నెల 16 నుంచి జరిగే  ఈ సదస్సుకు ఎంపిక చేసిన 2,300 మంది డెలిగేట్స్‌లో  జిన్‌పింగ్‌ కూడా ఉన్నారు. జిన్‌పింగ్‌ను అధ్యక్షుడిగా కొనసాగించే విషయమై వదంతులు షికారు చేస్తున్న తరుణంలో ఆయన బయటకు రావడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events