Skip to main content

Namaste NRI

ఆది సాయికుమార్ క్రేజీ ఫె లో ట్రైలర్ విడుదల

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్‌ కథానాయికలు. ఫణి కృష్ణ సిరికి దర్శకుడు. కె.కె. రాధామోహన్‌ నిర్మాత. ఈ నెల 14న ప్రేక్షకులు ముందుకొస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. మావాడు చాలా మారిపోయాడు.. ఇంతకుముందులా లేడు అంటూ అనీష్‌ కురువిల్లా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమై, పుణ్యానికి పోతే పాపం ఎదురయిందంటే ఇదే అనుకుంటా అంటూ అది చెప్పే డైలాగ్‌తో ముగిసింది. సరదా సరదా సన్నివేశాలతో ట్రైలర్‌ సాగుతుంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి హాస్యం, యాక్షన్‌ అంశాలు ప్రధానబలం. ఆది స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తాడని సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీకి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్‌, సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌, కెమెరా: సతీష్‌ ముత్యాల.

Social Share Spread Message

Latest News