Namaste NRI

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సౌతాఫ్రికాలోని జోహానెస్ బర్గ్ లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను  కన్నుల పండువగా నిర్వహించారు ఆడపడుచులు.  రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల, కోలాట పాటలు పాడారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలన్నీ నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. రంగురంగు పూల బతుకమ్మలతో ఆడపడుచుల ఆట, పాటలు..సంప్రదాయ నృత్యాలతో హోరెత్తాయి. కార్యక్రమంలో టాసా అధ్యక్షుడు యెలిగేటి వేణుమాధవ్, వైస్ చైర్మన్ తాళ్లూరి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ బండారు మురళి, కోశాధికారి బొబ్బాల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాపోలు సీతారామరాజు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు. మగవారు సైతం బతుకమ్మలతో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TASA కరోనా సమయంలో ప్రపంచంలో నే మొట్టమొదటి సారిగా ఆన్‌లైన్‌లో బతుకమ్మ పండగలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events