కమల్‌హాసన్ నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన ఘన విజయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మరో ఘనతను దక్కించుకుంది. ప్రతిష్టాత్మక 27వ బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఓపెన్ కేటగిరీలో ఈ సినిమా స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందిస్తూ ప్రతిష్టాత్మక బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మా సినిమా ప్రదర్శనకు ఎంపికవడం గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు మాకు మరో ఘనత దక్కింది అన్నారు. ఈ ఏడాది కోలీవుడ్ సూపర్‌హిట్‌గా నిలిచి కమల్ హాసన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.














