మన్యం కృష్ణ, నందితాశ్వేతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జెట్టి. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. వర్థిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత జెట్టి అంటే పోర్టు అని అర్థమని, మత్సకారుల జీవిన విధానాన్ని వెండితెరపై హృద్యంగా ఆవిష్కరించామని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లోని సమస్యల్ని చర్చించే చిత్రమిది. కొందరు స్వార్థంతో పోర్టుల పేరుతో మత్సకారుల జీవితాల్ని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో చూపించబోతున్నాం అని చెప్పారు. నందితాశ్వేత మాట్లాడుతూ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది అని చెప్పింది. ఈ నెల 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా : వీరమణి, సంగీతం: కార్తిక్ కొడకండ్ల, నిర్మాణ సంస్థ : వర్ధని ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుబ్రహ్మణ్యం పిచ్చుక.














