Skip to main content

Namaste NRI

అమెరికాలో దారుణం.. భారతీయ సిక్కు కుటుంబాన్ని

అమెరికాలోని మూడు రోజుల క్రితం భార‌తీయ సిక్కు కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని దుండ‌గులు. కాగా క్యాలిఫోర్నియాలో అపహరణకు గురైన నలుగురు సభ్యుల భారతీయ సిక్కు కుటుంబం, 8 నెలల పసి బాలుడి సహా హత్యకు గురైంది. క్యాలిఫోర్నియా అధికారులు ఈ ప్రకటించారు. ఇది భయంకరమైనది, అర్థం లేనిదంటూ మెర్సెడ్ కంట్రీ శాంతి భద్రతల చీఫ్ వెర్న్ వార్న్ కే వ్యాఖ్యానించారు.. 36 ఏళ్ల జస్ దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి దేరి, వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ (39) ఇండియానా రోడ్డు, హచిసన్ రోడ్డు సమీపంలో నిర్జీవంగా కనిపించినట్టు తెలిపారు. వ్యవసాయ కార్మికుడు వీరి మృత దేహాలను చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్న్ కే వెల్లడించారు. ఎన్ఆర్ఐ ఫ్యామిలీ కిడ్నాప్ అయిన ఒక రోజు త‌ర్వాత జీసెస్ మాన్యువ‌ల్ సాల్గ‌డోను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. నేరానికి పాల్ప‌డిన‌ట్లు సాల్గ‌డో త‌మ కుటుంబానికి చెప్పిన‌ట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం వీరంతా అపహరణకు గురవడం తెలిసిందే.

Social Share Spread Message

Latest News