Skip to main content

Namaste NRI

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభంజనం : అనిల్ కుర్మాచలం

సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రాబోయే రోజుల్లో దేశంలో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించబోతుందని ఎఫ్‌డీసీ చైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం అన్నారు.  ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్న అనిల్‌ వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం భారత రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు.  తెలంగాణ అభివృద్ధిని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వమే భారత దేశానికి శ్రీరామ రక్షా అనే భావన దేశ ప్రజల్లో ఉందన్నారు. ప్రస్తుతం జాతీయ పార్టీల శకం ముగిసిందని, కేసీఆర్‌ నూతన శకానికి నాంది పలికారని అన్నారు. ఎన్నారైలంతా  సీఎం కేసీఆర్‌ వెంటే ఉంటారని తెలిపారు.

Social Share Spread Message

Latest News