విశ్వజిత్, అర్చన సింగ్, ఊశ్వరి రాయ్, రఘుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కౌశిక వర్మ దమయంతి. గీతా కౌశిక్ నిర్మించారు. సుధీర్, విశ్వజిత్ దర్వకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రం నుంచి పదరా పదరా వేటకు వెళ్దాం అనే పాటను నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట చాలా బాగుంది. యస్.యస్.ఆత్రేయ మంచి స్వరాలందించారు. హేమచంద్ర చక్కగా ఆలపించారు. ఇది పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. నటుడు విశ్వజిత్ మాట్లాడుతూ రెండు శతాబ్దాల పూర్వం కథను వర్తమానంతో ముడిపెట్టి ఈ సినిమా రూపొందించాం. చారిత్రక నేపథ్య సినిమాగా ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రఘుదీప్, జిన్నా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.














