ఈనెల 16 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు వాషింగ్టన్ డిసి, వర్జీనియా నగరంలో అమరావతీ రాజధాని అంశంపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుందని పార్టీ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్ జయరాం కోమటి తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ రాష్ట్ర సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగిస్తున్నారు. వికేంద్రీకరణ ముసుగులో ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర నడిబొడ్డున నిర్మిస్తున్న రాజధానిపై మీకొచ్చిన బాధ ఏమిటని ప్రశ్నించారు. అమరావతి రాజధాని సమస్య ఒక ప్రాంతానికే పరిమితమైన అంశంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో సైతం అమరావతి రాజధానికి మద్దతు తెలియజేస్తున్నామన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు న్యాయస్థానం అనుమతిచ్చినప్పటికీ అడ్డంకులు సృష్టించడం మంచిది కాదన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, వాషింగ్టన్ డిసి ప్రాంతంలోని మేధావులు, విజ్ఞులు, ప్రవాసాంధ్రులందరు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జయరాం కోరారు.














