Skip to main content

Namaste NRI

రష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన

ఉక్రెయిన్పై క్షిపణిదాడులను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రష్యా భీకర దాడులు చేయదని వెల్లడిరచారు. ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, భారీ ఆస్తి జరిగింది. క్రెమ్లిన్ బ్రిడ్జిని ఉక్రెయిన్ పేల్చినందుకు ప్రతీకారంతో రష్యా ఈ భీకర దాడులకు పాల్పడి మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఐరోపా సమాఖ్య ఈ దాడులను తీవ్రంగా ఖండిరచి పుతిన్ యుద్ద నేరాలకు పాల్పడుతున్నట్లు విమర్శించింది. అయితే ఉక్రెయిన్ను సర్వనాశనం చేయడం తమ లక్ష్యం కాదని పుతిన్ పేర్కొన్నారు. అందుకే క్షిపణి దాడులు ఆపేస్తున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News