బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఆ దేశ ఆర్థిక మంత్రి క్వాసీ కార్టెంగ్‌ను పదవి నుంచి తొలగించారు. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ వివాదం కావటంతో ఆయనను పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తున్నది. ప్రధాని సూచనలతోనే తాను చాన్స్‌లర్ పదవి నుంచి తప్పుకొంటున్నానని క్వాసీ తెలిపారు. ఆయన 38 రోజులే ఆ పదవిలో కొనసాగారు. కాగా ఆయన స్థానంలో క్యాబినెట్ మాజీ మంత్రి జెరేమీ హంట్‌ను నియమిస్తూ ట్రస్ నిర్ణయం తీసుకొన్నారు. క్వాసీపై వేటుకు పన్నల కోత వ్యవహారమే కారణమని తెలుస్తున్నది. పన్ను కోతలపై సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ వల్ల మార్కెట్లు కుదేలవుతున్నట్టు చర్చ నడుస్తున్నది.














