ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ఎన్నావు, యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ వెల్క్మ్ టు తీహార్ కాలేజ్. ఇంటర్ విద్యావ్యవస్థలో విద్య పేరుతో జరుగుతున్న బందిఖానాని, అరాచకాన్ని సునిశిత హాస్యంతో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రమిది. ర్యాంకుల పోటీలో పడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసేలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో మనోజ్ నందన్ మాట్లాడుతూ ఈ చిత్రం తన కెరీర్లోనే వన్ ఆఫ్‌ది బెస్ట్ మూవీ అన్నారు. సునీల్ కుమార్ రెడ్డి గారు కథ చెప్పినపుడు చాలా బాగా నచ్చిందన్నారు. అక్టోబర్ 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాతైనా ఎడ్యుకేషన్ విధానంలో కొంచమైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. హీరోయిన్ సోనీరెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ కాలేజీ క్యాంపస్‌లో జరిగే కథ ఇది. గతంలో నేను టీచర్‌గా పని చేశా. విద్యార్థుల మనసుల్ని అర్థం చేసుకున్నారు కాబట్టే అనుకున్న కథని అనుకున్నట్టుగా తెరపైకి తీసుకొచ్చా. విద్యార్థులు మనోధైర్యాన్ని కూడగట్టుకునేలా చేస్తుందీ చిత్రం అన్నారు. ఈ కార్యక్రమంలో ఫని చక్రవర్తి, నిర్మాత బాపిరాజు, డైరెక్టర్ పి.సునీల్‌కుమార్ రెడ్డితో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది.














