శివ కార్తికేయన్ కథానాయకుడిగా అనుదీప్ కె.వి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రిన్స్. సునీల్ నారంగ్, డి.సురేస్‌బాబు, పి.రామ్మోహన్రావు నిర్మాతలు. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు హరీష్‌శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ అనుదీప్ హాస్యం ఎవ్వరినీ కించపరిచేలా ఉండదు. తను ఈ సినిమాలో నవ్వులతో పాటు మంచి సందేశం ఇస్తున్నారు. కథానాయిక ఈ సినిమాతో వచ్చిన డబ్బుని ఉక్రెయిన్‌లోని యుద్ధ బాధితులకి ఇవ్వాలనుకొంటోంది అన్నారు. ఈ చిత్రం ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ కార్యక్రమంలో మరియా, సత్యరాజ్, తమన్, రామజోగయ్యశాస్త్రి, వివేక్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, జెమిమీ కిరణ్, ఆదిత్య గుప్తా, విజయ్ కుమార్, ప్రేమ్‌జీ అమరన్, రాహుల్, భరత్ జాన్వి నారంగ్, శాండీ, నారాయణరెడ్డి , మనోజ్ పరమహంస, జగన్, భీమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.














