Skip to main content

Namaste NRI

భారత సంతతి రచయిత్రికి ప్రతిష్టాత్మక పురస్కారం

2019లో లండన్‌ వంతెనపై  జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాసిన ఆఫ్టర్‌మాథ్‌ నవలకు గాను భారత  సంతతి రచయిత్రి ప్రీతి తనేజా గోర్డాన్‌ బర్న్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. దీనికింద ఆమెకు 5 వేల పౌండ్లు లభిస్తాయి. ప్రస్తుతం ఆమె న్యూక్యాజిల్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కొందరి దృష్టిలో ఆఫ్టర్‌మాథ్‌ ఒక వివాదాస్పద పుస్తకం. మరికొందరికి అది బ్రిటన్‌ విద్యా వ్యవస్థలో వేళ్లూకున్న  జాత్యహంకారానికి, న్యాయవ్యవస్థ తదితరాల్లో ఉన్న వివక్షకు దర్పణం పడుతోంది అని తనేజా పేర్కొన్నారు. లండన్‌ వంతెన ఉగ్రదాడిలో ఐదుగురు చనిపోయారు.

Social Share Spread Message

Latest News