Skip to main content

Namaste NRI

ఘంటా శ్రీనివాస్‌ ఆవిష్కరించిన ఐక్యూ ఆడియో

కాయగూరల సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ నాయకానాయికలుగా నటించిన చిత్రం ఐక్యూ. జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుకను ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.  కాయగూరల లక్ష్మీపతి నిర్మాత. సుమన్‌, సూర్య, బెనర్జీ, పల్లె రఘునాధ్‌ రెడ్డి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్ర ఆడియోను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి ఘంటా శ్రీనివాస్‌రావు విడుదల చేశారు. యువతగా బాగా నచ్చే చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. నవంబర్‌ చివరి వారంలో సినిమా విడుదల చేస్తాం అన్నారు చిత్ర దర్శకుడు. నిర్మాత లక్ష్మీపతి మాట్లాడుతూ  మంచి కథ, కథానాలతో ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఘటికాచలం, బసిరెడ్డి, మంచాల సుధాకర్‌ నాయకుడు, అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News