Namaste NRI

శియా గౌతమ్‌ మరో మహాభారతం ప్రారంభం

ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌ నిర్మాణంలో ఎంఎస్‌రెడ్డి సమర్పణలో జగదీష్‌ దూగాన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మరో మహాభారతం. శియా గౌతమ్‌ ప్రధాన పాత్రలో తెరకుక్కుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్‌  సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్‌ పూరి క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైటిల్‌ చాలా బాగుంది. మంచి కథతో రానున్న ఈ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. కథకు తగ్గట్లుగా ఉంటుందని శియాను తీసుకున్నాం. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు చిత్ర దర్శకుడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events