Namaste NRI

అందుకే మళ్లీ హోంశాఖను కేటాయించారు

భారత సంతతి నాయకురాలు సుయెల్లా బ్రేవర్మన్‌ను హోంత్రిగా  బ్రిటన్‌ ప్రధానమంత్రిగా రిషి సునాక్‌ నియమించారు. అయితే సుయెల్లా మంత్రిగా నియమించడంపై తాజాగా దూరం చెలరేగింది. వ్యక్తిగత ఈ`మెయిల్‌ నుంచి అధికారిక సమాచారాన్ని పంపడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు స్వయంగా అంగీకరించి గతవారమే రాజీనామా చేసిన ఆమెకు తిరిగి కేబినెట్‌లో స్థానం కల్పించడమేంటని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి. సునాక్‌, బ్రేవర్మన్‌ మధ్య కుట్రపూరిత ఒప్పందం జరిగిందని ఆరోపించాయి. ఆ ఆరోపణలను కొత్త ప్రధాని తోసిపుచ్చారు. ఆమె పునర్నియామకాన్ని గట్టిగా సమర్థించుకున్నారు.

                 తన కేబినెట్‌ తొలి భేటీని ఏర్పాటు చేసిన సునాక్‌ అనంతరం హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత కీర్‌ స్టార్మర్‌ బ్రేవర్మన్‌ నియామకంపై ప్రధానిని ప్రశ్నించారు. సునాక్‌ స్పందిస్తూ ఆమె పొరపాటు చేశారు. దాన్ని గుర్తించి పదవి నుంచి తప్పుకొన్నారు. కాబట్టి ఆమెను తిరిగి ఐక్య కేబినెట్‌లోకి నేను సంతోషంగా స్వాగతించా. ఫలితంగా మంత్రివర్గానికి స్థిరత్వం చేకూరింది అని పేర్కొన్నారు.  నేరగాళ్లపై కొరడా రaళిపించడంపై, సరిహద్దులను పరిరక్షించడంపై ఆమె దృష్టిసారిస్తారని ధీమాగా తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events