Namaste NRI

ఆ జాబితా సిద్ధం చేయండి.. ఎలాన్‌ మస్క్‌

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌   సొంతం చేసుకున్న.  ఇక ఉద్యోగుల కోతపై మస్క్‌  దృష్టిసారించారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగించాలో జాబితా సిద్ధం చేయాలని సంస్థ మేనేజర్లను ఆదేశించారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన వెంటనే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్‌, లీగల్ పాలసీ ట్రస్ట్ లీడ్ విజయ గద్దె సహా పలువిభాగాల అధిపతులను మస్క్ తొలగించారు.  కాగా, ఉద్యోగుల తొలగింపుపై జరిగిన ప్రచారాన్ని మస్క్‌ ఇప్పటికే తోసిపుచ్చారు. తానొస్తే 75 శాతం ఉద్యోగాలను తీసేస్తానంటూ జరుగుతున్న ప్రచారం కరెక్టు కాదని, అలాంటి ఆలోచన లేదని ఆయన ఉద్యోగులతో అన్నట్లు తెలుస్తున్నది.

అయితే ట్విట్టర్ ప్రస్తుత మేనేజ్‌మెంట్ 2023 చివరి నాటికి కంపెనీ పేరోల్‌ (వేతనాల మొత్తం)ను సుమారు 800 మిలియన్ డాలర్లకు తగ్గించాలని అనుకుంటున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ తాజా నివేదికలు వెల్లడించాయి. అంటే దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తుందన్నమాట. ఇక కంపెనీలో పనిచేస్తున్న 7,500 మంది ఉద్యోగులలో దాదాపు 75 శాతం మందిని వదిలించుకోవాలని యోచిస్తున్నట్లు అమెరికా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్‌ 1లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని చూస్తున్నారని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News