Namaste NRI

బేడియా నుంచి తుంకేశ్వరి పాట

బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌, కృతిసనన్‌ జంటగా నటిస్తున్న సినిమా జేడియా. తాజాగా ఈ చిత్రం నుంచి తుంకేశ్వరి అనే పాట విడుదల చేశారు. డాన్స్‌ నెంబర్‌గా కంపోజ్‌ చేసిన ఈ పాట ఫిల్మ్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. తుంకేశ్వరి పాటలో వరుణ్‌ కృతి డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. ఈ పాటలో స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌ చేసిన స్పెషల్‌ అప్పియరెన్స్‌ అసలైన హైలెట్‌గా నిలిచింది. సచిన్‌ జిగర్‌ స్వరపరిచారు.  ఈ పాటను తెలుగులో కార్తీక్‌, అనూష మణి పాడారు. వరుణ్‌ ధావన్‌ మాట్లాడుతూ ఫ్లోర్‌ అదిరిపోయేలా డాన్స్‌ నెంబర్‌ అన్నారు థియేటర్‌లో ఆడియెన్స్‌ ఈ పాటకు స్టెప్పులేస్తారని అన్నారు. ఈపాటలో పెర్ఫార్మ్‌ చేయటాన్ని ఎంజాయ్‌ చేశానని, క్యాచీ లిరిక్స్‌, మంచి ట్యూన్‌తో ఈ పాట మీకు బాగా నచ్చుతుందన్నారు. కృతిసనన్‌ మాట్లాడుతూ వరుణ్‌ దావన్‌ సరసన ఇలాంటి పాటలో కన్పించి చాలా రోజులవుతుందన్నారు. ఈ పాట షూటింగ్‌ టైమ్‌ను ఎంజాయ్‌ చేశామన్నారు.  ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్‌ అని తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌ 25న పాన్‌ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. త్రీడీఫార్మాట్‌లో కూడా ఈ సినిమా రిలీజ్‌ కానుండటం విశేషం. ఈ చిత్రాని తొలి క్రియేచర్‌ కామెడీ మూవీగా దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తెరకెకిస్తున్నారు. జియో స్టూడియోస్‌ సమర్పణలో మ్యాడాక్‌ ఫిలింస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్‌ విజాన్‌ నిర్మాత. హిందీతో పాటు తెలుగులో తోడేలు టైటిల్‌తో నవంబర్‌ 25న విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News