విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా చెల్లా అయ్యాపు దర్శకత్వం వహించిన చిత్రం మట్టి కుస్తీ. ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్‌పై హీరోలు రవితేజ, విష్ణు విశాల్ నిర్మించారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన టైటిల్ పోస్టర్‌ను ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. ఇక ఈ చిత్రానికి మాస్‌రాజా రవితేజ మరో నిర్మాతగా ఉండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రవితేజ రిలీజ్ చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన చిత్రమిది. గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం : జస్టిస్ ప్రభాకరన్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్.














