Namaste NRI

దేశ భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంది : జో బైడెన్‌

 అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆ  దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి బెదిరింపులు, రాజకీయ హింసపై   వైట్‌హౌస్‌లో బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ  ఈ దాడులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కారణమని అయన పేరు చెప్పకుండా పరోక్షంగా ఆరోపించారు.   ప్రజాస్వామ్యంపై బెదిరింపులకు దిగుతున్న రాజకీయ హింసను వ్యాప్తి చేసే వారిని హెచ్చరించారు. అధికారం, లాభం కోసం మాట్లాడే అబద్దాల ఫలితమే హింస అన్నారు. ఇదంతా కుట్ర, కోపం, ద్వేషం, హింసను ప్రేరేపించడానికి అబద్దాలను పదేపదే చెప్పడం ఫలితమన్నామని పేర్కొన్నారు.  ఈ పరిస్థితుల్లో అబద్దాలను నిజంతో ఎదుర్కోవాలని, దేశ భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు.  ఒక దేశం గట్టిగా మాట్లాడాలని, డెమోక్రాట్స్‌, రిపబ్లికన్ల మద్దతుదారులైనా ఓటర్లపై బెదిరింపులు, రాజకీయ హింసకు అమెరికాలో చోటు లేదని పిలుపునిచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events