వైష్ణవి ఫిలింస్ పతాకంపై నాగశౌర్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.ఎస్.ఆరుణాచలం దర్శకుడు. శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్, డా.అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. బేబి అద్వైత, భవిష్య సమర్పకులుగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నిశేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు తిరుమల కిషోర్ గౌరవ దర్శకత్వం వహించారు. సాంబశివారెడ్డి, సంతోష్‌కుమార్ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్న చిత్రమిది అని సినీవర్గాలు తెలిపాయి. నాగశౌర్య కెరీర్లో 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు శౌర్య అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జయరాజ్, కెమెరా: వెట్రి పళనిసామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి భాస్కర్.














