పూలరంగడుతో ప్రేక్షకుల్ని నవ్వించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరి నరేష్ అగస్త్య హీరోగా దిల్‌వాలా అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. శ్వేత అవస్తి కథానాయిక. నబీషేక్, తూము నర్సింహ పటేల్ నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ కామెడీ జోనర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.














