Skip to main content

Namaste NRI

ఈ ఎన్నికతో తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానం లేదు

మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానం లేదని మరోసారి స్పష్టమైందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల అన్నారు. విజేతగా నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్‌ ఆఫ్రికా శాఖ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కేసీఆర్‌ దిశా నిర్దేశానికి మునుగోడు ఫలితం నాంది పలికిందన్నారు. మునుగోడు విజయం సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అభివర్ణించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడంతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందన్నారు. బీఆర్‌ఎస్‌ జైత్రయాత్రకు మునుగోడు గెలుపు నాంది కానుందని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News