Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌పై జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియాలో బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన బైడెన్‌  మాట్లాడుతూ ట్రంప్‌ అమెరికాలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ట్రంప్‌ తాను 2024 ఎన్నికల బరిలోకి దిగుతున్నాను అని చెప్పిన నేపథ్యంలో బైడెన్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉండగానే ట్రంప్‌ పూర్తిగా విఫలమయ్యారు. అందుకు ఆనాడు ఎన్నికల్లో రిగ్గింగ్‌కి పాల్పడటం, హెల్త్‌కేర్‌ల పై దాడి చేయడం, మహిళల హక్కులపై దాడి చేయడం, హింసాత్మకంగా ప్రవర్తించడం, వైట్‌హౌస్‌పై దాడి తదితరాలన్ని నిదర్శనం అని తెలిపారు.  2020 ఎన్నికల ఓటమికి కారణం అని నర్మగర్భంగా తేల్చి చెప్పారు.

Social Share Spread Message

Latest News