Skip to main content

Namaste NRI

వాల్తేరు వీరయ్య నుంచి బాస్‌ వచ్చిండు.. కిక్‌ తెచ్చిండు

చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య.  శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. బాబీ కొల్లి ( కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు.  నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ప్రత్యేక గీతం లిరికల్‌ వీడియోని విడుదల చేశారు.  బాస్‌ వచ్చిండు.. కిక్‌ ఇచ్చిండు అంటూ సాగే బాస్‌ పార్టీ పాటతో హంగామా షురూ అయ్యింది.  చిరంజీవి, ఊర్వశి రౌతేలాపై తెరకెక్కించిన ఈ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరచగా, ఆయనతో కలిసి నకాస్‌ అజీజ్‌, హరిప్రియ ఆలపించారు. శేఖర్‌ నృత్య రీతులు సమకూర్చారు. మాస్‌ యాక్షన్‌ అంశాలతో కూడిన ఈ చిత్రంలో చిరంజీవి మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్ధర్‌ ఎ.విల్సన్‌. ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఎ.ఎస్‌.  ప్రకాష్‌, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, కె. చక్రవర్తి రెడ్డి.

Social Share Spread Message

Latest News