Namaste NRI

మరోసారి వివాదంలో బ్రిటన్‌ ప్రధాని … రూ.12 కోట్లతో

   బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.  లండన్‌లోని డౌనింగ్‌ స్ట్రీల్‌లోని తన అధికార నివాసంలో తోటలో దాదాపు రూ.12.83 కోట్ల విలువైన శిల్పాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ శిల్పి హెన్రీ మూర్‌ రూపొందించిన ఈ శిల్పాన్ని గత నెలలో క్రిస్ట్‌ సంస్థ నిర్వహించిన వేలంలో బ్రిటన్‌ ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.  ఒకవైపు దేశంలో జీవన వ్యయం పెరిగిపోయి, జనం కష్టాలు పడుతున్న వేళ పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇలా ఖర్చు చేయడమేంటంటూ విమర్శలు చుట్టుముడుతున్నాయి.

Social Share Spread Message

Latest News