Namaste NRI

 మట్టి కుస్తీ  ప్రీ రిలీజ్‌ వేడుక

విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మి జంటగా  చెల్లా అయ్యాపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మట్టి కుస్తీ. హీరో రవితేజతో కలిసి విష్ణు విశాల్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 2న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా  రవితేజ మాట్లాడుతూ విష్ణు విశాల్‌ చాలా పాజిటివ్‌ పర్సన్‌. తనని కలిసిన మొదటిసారి ఎన్నాళ్లో పరిచయం ఉన్న వాడిలా అనిపించాడు.  సింగిల్‌ సిట్టింగ్‌లోనే మట్టి కుస్తీ చిత్రం ఓకే అయిపోయింది. చెల్లా అయ్యావు ఈ చిత్ర కథ చెప్పినప్పుడు నవ్వి నవ్వి చచ్చాను.  తనతో కచ్చితంగా ఓ సినిమా చేయాలి. చేస్తాను  జస్టిస్‌ ప్రభాకరన్‌తోనూ పని చేస్తాను. రిచర్డ్స్‌ అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చాడు. అందం, ప్రతిభ కలిస్తే ఐశ్వర్య లక్ష్మి. ఇందులో తన పాత్ర చాలా బాగుంటుంది. ఇది కేవలం స్పోర్ట్స్‌ ఫిలిం మాత్రమే కాదు. లవ్‌, ఫ్యామిలీ, యాక్షన్‌,  ఎమోషన్‌ ఇలా అన్నీ ఉన్నాయి. మట్టి కుస్తీ చాలా బాగా వచ్చింది. కచ్చితంగా అందరూ ఎంజాయ్‌ చేస్తారు అన్నారు.  ఈ వేడుకలో డైరెక్టర్స్‌ సుధీర్‌ వర్మ,  వంశీ, ఐశ్వర్య లక్ష్మి, సంగీత దర్శకుడు జస్టిస్‌ ప్రభాకరణ్‌,  కెమెరామేన్‌ రిచర్డ్‌ ఎం.నాథన్‌, రచయితలు రాకేందు మౌళి, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News