Skip to main content

Namaste NRI

ఎలాన్‌ మస్క్‌ మరో సంచలనం…  ఆరు నెలల్లో మనుషులపై  

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తన బ్రెయిన్‌ చిప్‌ ఇంటర్‌ఫేస్‌ స్టార్టప్‌ అభివృద్ధి చేసిన వైర్‌లెస్‌ పరికరాన్ని ఆరు నెలల్లో మనిషి మెదడులో అమర్చనున్నట్లు ప్రకటించారు.  కాలిఫోర్నియాలోని న్యూరాలింక్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మస్క్‌ బ్రెయిన్‌ `కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (బీసీఐ) సాంకేతికత వివరాలను తెలిపారు.  ఈ టెక్నాలజీని మరో ఆరు నెలల్లో మనిషిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీని కోసం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)కు సమర్పించే పత్రాలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడిరచారు. ఇప్పటి వరకు ఎఫ్‌డీఏతో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని వివరించారు.  ఈ సందర్భంగా మనిషి మెదడులో ప్రవేశపెట్టబోయే చిప్‌తో పాటు దాన్ని అమర్చే రోబోను కూడా పరిచయం చేశారు.

Social Share Spread Message

Latest News