Skip to main content

Namaste NRI

హీరో సాయితేజ్‌ కొత్త చిత్రం స్టార్ట్‌

 సాయితేజ్‌ కథానాయకుడిగా బీవీఎస్‌ఎన్‌  ప్రసాద్‌ నిర్మాణంలో  ఓ సినిమా రాబోతుంది. దీని ద్వారా జయంత్‌ పానుగంటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయితేజ్‌ క్లాప్‌ కొట్టారు. నిర్మాత బాపినీడు భోగపల్లి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం నిర్మాత బీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ  సాయితేజ్‌తో మా సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమా రూపొందించనున్నాం.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌  ప్రారంభించనుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అలాగే ఇతర  నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తాం అన్నారు.

Social Share Spread Message

Latest News