Namaste NRI

సిద్దిపేటలో తానా చైతన్య స్రవంతి  కార్యక్రమం  

తెలంగాణలోని సిద్దిపేటలో తానా  చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల రూపాయలు విలువైన పరికరాలను లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. దీనిలో భాగంగా 15 మంది బాలికలకు సైకిళ్లు, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, ఆరుగురు వికలాంగులకు మూడు చక్రాల బ్యాటరీ సైకిళ్లు అందించారు.. తానా ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీలు రవి, సామినేని విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News