Skip to main content

Namaste NRI

వెంకటేష్‌ బర్త్‌డే స్పెషల్‌గా నారప్ప

 విక్టరీ వెంకటేష్‌ బర్త్‌డే కానుకగా డిసెంబర్‌ 13న నారప్ప సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.  వెంకటేష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌. వి క్రియేషన్స్‌ నిర్మాణంలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.  యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన నారప్ప చిత్రంలో ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల, రావు రమేశ్‌, నాజర్‌, రాఖీ ( నారప్ప చిన్న కుమారుడు)కీ  రోల్స్‌ పోషించారు.  నారప్ప లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీలో విడుదలైన బిగ్గెస్‌ హిట్‌ను అందుకుంది. అయితే నారపను బిగ్‌స్క్రీన్‌పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. అప్పుడు థియేటర్లలో విడుదల కాకపోవటంతో నిరాశ పడ్డారు. ఇప్పుడు నారప్ప థియేటర్లలో విడుదల కానుండటంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఓటీటీలో విడుదలైన సినిమాను థియేటర్లలో  విడుదల చేయటం ఇదే తొలిసారి. దీంతో విక్టరీ వెంకటేష్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News