Skip to main content

Namaste NRI

ఎంతవారు గాని  టీజర్‌ విడుదల చేసిన అడవి శేష్‌

సూర్య శ్రీనివాస్‌ షెర్రీ అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో  సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ చిత్రం ఎంతవారు గాని. ఈ మూవీతో ఎన్‌.శ్రీనివాసన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  రాజశేఖర్‌ అన్న భీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ చిత్ర టీజర్‌ను హీరో అడివి శేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  టీజర్‌ బాగుంది. యువతరాన్ని ఆకర్షించే ఓ ఆసక్తికర అంశం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ఘన విజయం సాధించాలని  కోరుకుంటున్నా అన్నారు. వినూత్నమైన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి.  తమ సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్‌, రొమాన్స్‌ కూడా ఉంటుందని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలిపింది.

Social Share Spread Message

Latest News