Namaste NRI

తానా ఆధ్వర్యంలో ట్రై సైకిళ్లు, లాప్ టాప్ ల పంపిణీ

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో దివ్యాంగుల ట్ర్రై సైకిళ్ల పంపిణీ మరియు నిరుపేద విద్యార్థులకు చేయూతనందిస సైకిళ్ల  పంపిణీ, ఉజ్వల భవిష్యత్తు కూ ల్యాప్‌ టాప్‌ ల పంపిణి కార్య క్రమాని  మహబుబాబాద్‌ జిల్లా  కురవి మండలం నేరడ గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో  నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ గుండోజు శ్రీనివాస్‌ సారథ్యంలో తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య  చౌదరి లావు, తానా ఫౌండేషన్‌ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ  వెంకట రమణ, నిరంజన్‌ శృంగవరపు, సామినేని రవి, కల్లూరి జయ శేఖర్‌, విద్యాంగులకు ఎనిమిది ట్ర్రై సైకిళ్లు, హైస్కూల్‌ బాలికలకు, మోడల్‌ స్కూల్‌ బాలికలకు 35 సైకిళ్లను,  ఐఐటీ విద్యార్థి కి ల్యాప్‌ టాప్‌ లను అందజేశారు.  మాతృదేశం మీద మమకారంతో ఉత్తర అమెరికాలో స్థిరపడిన ఉత్తమమైన తెలుగువారు అనేక సేవా కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను తానా స్రవంతి వెచ్చిస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో మహబుబాబాద్‌ జిల్లా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీమతి జజ్జూరి ఉమా పిచ్చి రెడ్డి,  టీఆర్‌ఎస్‌ యూత్‌ రాష్ట్ర నాయకులు గుగులోత్‌ రవినాయక్‌, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వెల్ఫేర్‌ సొసైటీ చైర్మన్‌ జాని, ఉప సర్పంచ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లెపాక మధు, యూత్‌ నాయకులు జక్కుల సందీప్‌, యస్‌ యం సి చైర్మన్లు, విద్యాశాఖ అధికారులు, వార్డు మెంబర్‌లు, అధ్యాపక బృందం, స్థానిక నాయకులు, యువకులు తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events