అమెరికాలోని శాన్ఫ్రాన్సి్సకోలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), కలవెండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు కలవెండి సంస్థ సలహాదారు డా. కె.ధర్మారావు తెలిపారు. పి.మురళీకృష్ణ, మాల తంగిరాల, సుధీర్ గణపతి, సిరినీతి, నవీన్, కృష్ణకాంత్ రాయసం, శ్రీనివాస్, అనురాధ, శృతిప్రదీ్ప పాటలు పాడి అమర గాయకుడికి ఘనంగా స్వరాభిషేకం చేశారు. తానా పూర్వ అధ్యక్షులు జయరాం కోమటి గాయనీ, గాయకులకు సర్టిఫికెట్లు బహూకరించారు. బాటా కార్యవర్గ సభ్యులు విజయ ఆసూరి, నీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, హరనాథ్ చీకోటి, కొండల్ కోమర్గిరి, హరిసన్నిధి, కేఎస్.మూర్తి పాల్గొన్నారు.














