Skip to main content

Namaste NRI

లాస్ ఏంజిల్స్ ఎన్నారై టీడీపీ  ఎగ్జిక్యూటివ్ కమిటీ  నియామకం

తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా అమెరికాతో సహా వివిధ దేశాలలోని అనేక పట్టణాలకు ఎన్నారై టీడీపీ  కమిటీలను ప్రకటించింది. లాస్ ఏంజిల్స్ ఎన్నారై ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆంధ్రప్రదేశ్  తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ కమిటీకి వెంకట్ ఆళ్ల అధ్యక్షుడిగా, సురేష్ అంబటి ఉపాధ్యక్షుడిగా, రాహుల్ వాసిరెడ్డి సెక్రెటరీగా, విష్ణు అటుకారి ట్రెజరర్‌గా, హేమకుమార్ గొట్టి సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా, చందు నంగినేని రీజనల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్‌గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ ఆళ్ల మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఈ బాధ్యతని అప్పగించిన జయరాం కోమటి, డాక్టర్ రవి వేమూరిలకు ధన్యవాదాలు చెప్పారు. లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఉన్న పార్టీ అభిమానులను, ఒక్క తాటిపైకి తెచ్చి, చంద్రబాబును మరల ముఖ్యమంత్రిని  చేయడంలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు.

Social Share Spread Message

Latest News