కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తాజాగా హాంకాంగ్ విదేశీ సందర్శకులపై ఆంక్షల్ని ఎత్తేసింది. డిసెంబర్ 13వ తేదీ నుంచి హాంకాంగ్‌కు వచ్చే పర్యాటకులకు కొవిడ్ నియంత్రణలు వర్తించవని జాన్ లీ అనే అధికారి తెలిపారు. అంతేకాదు జీపీఎస్ సాయంతో పనిచేసే మొబిలిటీ ట్రాకింగ్ కరోనా యాప్‌ను కూడా నిలిపివేసింది. ‘హాంకాంగ్‌కు వచ్చే పర్యాటకులపై ఏ విధమైన ఆంక్షలు ఉండవు. అదే రోజు వాళ్లు నచ్చిన ప్లేస్‌కు వెళ్లొచ్చు. అయితే, అధికారులు అడిప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నట్టు గుర్తుగా ఫొటో లేదా సర్టిఫికెట్ చూపిస్తే చాలు’ అని ఆరోగ్య శాఖ కార్యదర్శి లీ చుంగ్ మా వెల్లడించారు.
హాంకాంగ్‌కు వచ్చే పర్యాటకులు, విదేశాల నుంచి వచ్చే దేశ ప్రజలకు కూడా విమానాశ్రయంలో కరోనా టెస్ట్ చేస్తారు. నెగెటివ్ వచ్చిన వాళ్లను బార్లు, రెస్టారెంట్లలోకి అనుమతిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆ దేశంలోని పర్యాటక రంగం, వ్యాపార రంగం ఊపందుకోనున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్‌లు మళ్లీ జనంతో కిటకిటలాడనున్నాయి.














