Namaste NRI

లండన్‌లో బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ

లండన్‌లోని చారిత్రక టవర్‌ బ్రిడ్జి వద్ద బీఆర్‌ఎస్‌ జెండాను   ఆవిష్క‌రించారు.  ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎన్నారైసెల్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ దూసరి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేయడం గర్వంగా ఉన్నదన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా అమలు కావాలంటే అది కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు.  భారత దేశం నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులని ఆహ్వానించి  త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ  ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తామని ఎన్నారై సెల్‌ యూకే సలహా మండలి చైర్మన్‌ చందుగౌడ్‌ సీక చెప్పారు.

 ఈ  కార్యక్రమంలో ఎన్నారై సెల్‌ యూకే ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి, కార్యదర్శులు హరిగౌడ్‌ ఎన్‌, సత్య చిలుముల, శ్రీకాంత్‌ జె, కోశాధికారి సతీశ్‌, అధికార ప్రతినిధులు రవిప్రదీప్‌, రవి, లండన్‌ ఇన్‌చార్జి నవీన్‌, కోర్‌కమిటీ సభ్యులు అబ్దుల్‌ జాఫర్‌, పృథ్వీరావు, మధుయాదవ్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News