Skip to main content

Namaste NRI

రణ్‌బీర్‌ కపూర్‌  యానిమల్‌  ఫస్ట్‌లుక్‌

అర్జున్‌రెడ్డి  దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్‌. రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాతలు. నూతన ఏడాదిని పురస్కరించుకొని  చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రణ్‌బీర్‌కపూర్‌ రక్తమోడుతున్న దుస్తుల్లో గొడ్డల్ని పట్టుకొని టెర్రిఫిక్‌గా కనిపిస్తున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఆయన లుక్‌ ఆసక్తినిరేకెత్తించేలా ఉంది. ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. వినూత్నమైన కథాంశంతో రూపొందిస్తున్నాం. రణబీర్‌కపూర్‌ పాత్ర నవ్యపంథాలో ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఆగస్ట్‌ 11న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News