Skip to main content

Namaste NRI

వీరసింహారెడ్డి నుంచి కొత్త అప్‌డేట్‌ .. జనవరి 3న

నందమూరి బాలకృష్ణ  నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి.  శృతిహాసన్‌  హీరోయిన్‌గా నటిస్తోంది.  స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని. ధునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, హనీ రోజ్‌, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీ రోల్స్ పోషిస్తున్నారు.  కాగా ఎంటర్‌టైన్‌ మెంట్‌ డోస్‌ మరింత పెంచుతూ కొత్త అప్‌డేట్‌ అందించారు మేకర్స్‌.  వీరసింహారెడ్డి నుంచి ఇప్పటికే విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్‌, సుగుణ సుందరి, మా బావ మనోబావాలు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేలా సాగుతున్నాయి.

ఈ సినిమా నుంచి నాలుగో పాట మాస్‌ మొగుడు సాంగ్‌ను జనవరి 3న వీరసింహారెడ్డి రాత్రి 07:55 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు కొత్త పోస్టర్‌ ఒకటి విడుదల చేశారు. బాలయ్య, శృతిహాసన్‌ మరోసారి స్టైలిస్ బీట్‌తో అలరించబోతున్నట్టు పోస్టర్‌ లుక్‌తో తెలిసిపోతుంది.  ఈ మూవీ టీజర్‌ గూస్‌ బంప్స్ తెప్పించే బాలకృష్ణ మార్క్‌ డైలాగ్స్ తో సాగుతూ విడుదలకు ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. వీరసింహారెడ్డి చిత్రానికి ఎస్‌ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. 

Social Share Spread Message

Latest News