Namaste NRI

శాకుంతలం మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్.. ఋషి వ‌నంలోన‌

సమంత టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్న పౌరాణిక ప్రణయ గాథ శాకుంతలం. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకుడు. ఈ సినిమాలోని రుషి వనంలోన.. అనే పాటను ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ స్వరాల్ని సమకూర్చిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్నందించారు. సిధ్‌శ్రీరామ్‌, చిన్మయి ఆలపించారు. స్వయం వరమేదీ జరుగలేదే…స్వయంగా తానే వలచినాడే..చెరకు శరమే విసిరినాడే, చిగురు యదనే గెలిచినాడే అంటూ సాగే ఈ గీతం దుష్యంతుడి, శకుంతల ప్రణయభావనలకు అద్దం పట్టేలా ఉంది. ఈ సినిమాలో ఈ పాట ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని, దృశ్యపరంగా కనులవిందుగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగా విడుదలైన మూవీ ట్రైలర్, మల్లికా మల్లికా. సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి.  ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events