Skip to main content

Namaste NRI

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు అమెరికా షాక్‌

సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు భారీఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైన్యం దాడిలో ఐసీస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీ హతమయ్యాడు. ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్సులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ISIS)   గ్రూప్ ప్రాంతీయ నాయకుడైన సుదానీని పట్టుకునేందుకు అమెరికన్ పారామిలిటరీ దళాలు యత్నించాయి. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో సుదానీతోపాటు అతని సహచరులు మరో 10 మంది మంది హతమయ్యారని యూఎస్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ఆపరేషన్లో తమ సైనికులెవరూ గాయపడలేదని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News