Namaste NRI

మార్చి 17న ఇండియానే కాదు గ్లోబ్‌ను కబ్జా చేయబోతున్నాం

అగ్ర నటుడు ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కబ్జా. ఆర్.చంద్రు దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ తన సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై తెలుగులో విడుదల చేస్తున్నారు. మార్చి 17న ప్రేక్షకుల ముందుకురానుంది.  హైదరాబాద్ లో టై టిల్ సాంగ్ ను విడుదల చే శారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో ఈ సినిమాను మొదలుపెట్టాం. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ధైర్యంగా పూర్తి చేశాం. పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలనే పట్టుదలతో నిర్మాత చాలా కష్టపడ్డారు. మార్చి 17న కేవలం ఇండియానే కాదు గ్లోబ్ను కబ్జా చేయబోతున్నాం (నవ్వుతూ) అని అన్నారు.

దర్శకుడు చంద్రు మాట్లాడుతూ నా కెరీర్‌లో  తొలి పాన్ ఇండియా చిత్రమిది. నిజాయితీగా పనిచేస్తే ఎప్పటికైనా ఫలితం వస్తుందనే ఉపేంద్రగారి మాటల్ని నేను విశ్వసిస్తాను. కన్నడంలో కేజీఎఫ్ నన్ను బాగా ప్రభావితం చేసింది. ఓటీటీల వల్ల నేటి ప్రేక్షకులు గ్లోబల్ మూవీస్ చూస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని వినూత్నమైన కథను సిద్ధం చేశా. టీమ్ అందరి సమిష్టి కృషితో సినిమా గొప్పగా వచ్చింది.  రవి బస్రూర్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. చంద్రబోస్ అద్భుతమైన ఓ గీతాన్ని అందించారు  అని తెలిపారు. నిర్మాత హనుమంత రెడ్డి మాట్లాడుతూ తెలుగులో సుధాకర్ రెడ్డిగారితో కలిసి కబ్జ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. బుద్ధిమంతుడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాం. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ కబ్జ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది  అన్నారు.  శ్రియ సరన్ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినప్పుడే అద్భుతంగా ఉందనిపించింది. ఉపేంద్ర వంటి సీనియర్ నటుడితో తెరను పంచుకోవడం కొత్త అనుభూతినిచ్చింది  అని పేర్కొంది.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి ఉపేంద్రగారికి అభిమానిని. ఆయన సినిమాకు టైటిల్ పెట్టకుండా చేయి సింబల్ పెట్టి రిలీజ్ చేశారు. అది చూసి నేను షాకయ్యాను. ఆయన ఐడియాలజీని నేను లవ్ చేస్తాను. నేను డైరెక్ట్ చేసిన సినిమాకు ఉపేంద్రగారినే కొంత స్ఫూర్తిగా తీసుకున్నాను. కబ్జ సినిమా పెద్ద హిట్ కావాలి. సుధాక‌ర్‌గారికి, నితిన్‌గారికి  బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. రవి బస్రూర్ మ్యూజిక్ బావుంది. చంద్రుగారికి ఆల్ ది బెస్ట్ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events