Skip to main content

Namaste NRI

నా కెరీర్‌లోనే కరికాల బెస్ట్‌ సినిమా అవుతుంది : సందీప్‌కిషన్‌

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం కరికాల. కేథరిన్‌ థ్రెసా, గాయత్రి భరద్వాజ్‌, సాక్షి మడోల్కర్‌ కథానాయికలు. యుగంధర్‌ ముని దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనున్నది. తొలిభాగాన్ని వచ్చే ఏడాది జూలై 2న, మలిభాగాన్ని వచ్చే ఏడాది అక్టోబర్‌ 28న విడుదల చేయనున్నారు. మహిధర్‌రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మాతలు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

నిర్మాత రాజశేఖర్‌ అన్నభీమోజు తల్లి సత్యవతి కెమెరా స్విచాన్‌ చేయగా, మరో నిర్మాత మహిధర్‌రెడ్డి తల్లి పద్మారెడ్డి క్లాప్‌ కొట్టారు. తొలి సన్నివేశాన్ని ఆది సాయికుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజశేఖర్‌ తండ్రి వీరభద్రాచారి స్క్రిప్ట్‌ని అందజేశారు. అతిథులంతా సినిమా బాగా రావాలని శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమా రెండు పార్టులకు సంబంధించిన కథ దర్శకుడు వివరించాడు.

అయితే, ఒక్కనిమిషం కూడా బోర్‌ అనిపించలేదు. గత ఆరేడు నెలలుగా ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దర్శక,నిర్మాతలు దొరకడం నా అదృష్టం. నాకెరీర్‌లోనే కరికాల బెస్ట్‌ సినిమా అవుతుంది అని సందీప్‌కిషన్‌ చెప్పారు. ఈ ఫ్రాంచైజీ ఓ చందమామ కథలా ఉంటుందని దర్శకుడు యుగంధర్‌ తెలిపారు. ఇంకా నిర్మాతలు, కథానాయికలు, సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events