
ఇద్దరు బంగ్లాదేశీయులకు సౌదీలో మరణశిక్ష విధించడం సంచలనంగా మారింది. సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం పవిత్ర నగరమైన మక్కాలోని ఓ మసీదులో ఇద్దరు బంగ్లాదేశీ పౌరులు నజెరుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితి అక్తర్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరినీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో వీరిద్దరూ దోషులుగా తేలడంతో ఇస్లామిక్ చట్టం ప్రకారం మరణశిక్ష విధించారు. అయితే ఆ ఇద్దరు ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడ్డారో మాత్రం వివరించలేదు.















