Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రతిపాదన .. వారికి మరణశిక్షే!

విధి నిర్వహణలో ఉన్న అగ్నిమాపక సిబ్బందిని (ఫైర్‌ఫైటర్లను) హత్య చేసే వ్యక్తులకు మరణశిక్ష విధించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ కఠిన శిక్షను అమలు చేసే మార్గాలపై చట్టపరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన తన అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్‌ను ఆదేశించారు. వైట్‌హౌస్‌లో ఫస్ట్ రెస్పాండర్లను గౌరవించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొన్ని సందర్భాల్లో అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనలెక్కి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వారిపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడుతున్నారని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇలాంటి దాడులకు మీడియాలో తగినంత ప్రచారం లభించడం లేదని పేర్కొన్నారు. తమ పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచీ ఫస్ట్ రెస్పాండర్లకు కావాల్సిన వనరులతో పాటు పూర్తి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే గత నెలలో దేశవ్యాప్తంగా ఉన్న 1,600 ఫైర్ డిపార్ట్‌మెంట్‌లకు సుమారు 648 మిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయాన్ని అందించినట్లు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events