Skip to main content

Namaste NRI

ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ

స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్ నారాయణ మూర్తి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా యూనివర్సిటీ. ప్రస్తుతం విద్యావిధానంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నూతన నటీనటులతో మూవీని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్ లో ఈ మూవీ టైటిల్ లోగోను పద్మశ్రీ బ్రహ్మానందం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తికి సినిమానే ప్రాణం. ప్రజా దర్శకుడు ఆయన. చలన చిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే, ఆ సముద్రమే చూసే వ్యక్తి నారాయణమూర్తి. ఇవాళ చదువు కొనే రోజులు వచ్చాయి. విద్యను వ్యాపారం చేశారు. విద్యా వ్యవస్థలోని ఇలాంటి లోపాలను ప్రశ్నిస్తూ ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.  ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ మన దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాను. సత్యానంద్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ఈ చిత్రంలో నటించారు. విద్య, వైద్యం వంటి సేవా రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని రాజ్యాంగం చెబుతున్నది. కానీ ఈ రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయమనే హామీలను ప్రధాని మోదీ నిలుపుకోవాలి అన్నారు.

Social Share Spread Message

Latest News